Bapatla Railway Station: బాపట్ల రైల్వే స్టేషన్‌‌లో 21 కేజీల గంజాయి పట్టివేత

Bapatla Railway Station 21 kg Ganja Seized
  • పూరి - తిరుపతి ట్రైన్ లో అక్రమంగా గంజాయి తరలింపు
  • బాపట్ల రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేసిన ఈగల్, ఆర్పీఎఫ్ సిబ్బంది
  • ఒడిశాకు చెందిన ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రైన్‌లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు బాపట్ల రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. పూరి – తిరుపతి రైలులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు, బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద ఈగల్‌, ఆర్‌పీఎఫ్ టీమ్‌లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 21 కేజీల గంజాయి పట్టుబడింది. 
 
ప్రాథమిక విచారణలో ప్రకాశ్‌ అనే వ్యక్తి ఒడిశాలోని బరంపూర్‌ నుంచి కేరళకు ఈ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
 
రైల్వే స్టేషన్లలో క్రమం తప్పకుండా తనిఖీలు కొనసాగిస్తామని, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈగల్‌ టీమ్‌ అధికారులు హెచ్చరించారు.
Bapatla Railway Station
Bapatla
Ganja Seizure
Railway Police
Ganja Smuggling
Puri Tirupati Train
Odisha
Kerala
Illegal Drugs
Crime News

More Telugu News