Allu Arjun: 'శివ' రీ-రిలీజ్... రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్న అల్లు అర్జున్!

Shiva Movie Re release Allu Arjuns Special Message
  • నవంబర్ 14న థియేటర్లలోకి 'శివ' రీ-రిలీజ్
  • సినిమాపై వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్
  • థియేటర్లకు రెండు లారీల పేపర్లు తీసుకురావాలని ఫ్యాన్స్‌కు పిలుపు
  • భారతీయ సినిమాను మార్చిన చిత్రమన్న బన్నీ
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ'. 36 ఏళ్ల క్రితం తెలుగు సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 14న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు 'శివ'తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ వీడియోలు విడుదల చేయగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరారు.

'శివ' రీ-రిలీజ్‌పై అల్లు అర్జున్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. "తెలుగు సినిమా చరిత్రలో 'శివ' ఒక ఐకానిక్ చిత్రం. ఈ ఒక్క సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాంటి సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంటే, ఆ సంబరాన్ని గ్రాండ్‌గా జరుపుకోవాలి. అక్కినేని అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు నాదొక విజ్ఞప్తి. ఈసారి థియేటర్‌కు వెళ్లేటప్పుడు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి" అంటూ తనదైన శైలిలో పిలుపునిచ్చారు.
Allu Arjun
Shiva movie
Nagarjuna
Ram Gopal Varma
Shiva re-release
Telugu cinema
Icon Star
Sekhar Kammula
Ashutosh Gowariker

More Telugu News