Indian Nurse: సింగపూర్ ఆసుపత్రిలో అఘాయిత్యం.. భారత మేల్ నర్సుకు జైలు, కొరడా దెబ్బలు

Indian Nurse Jailed For Molesting Male Visitor At Singapore Hospital
  • పురుషుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత మేల్ నర్సు
  • ఏడాదికి పైగా జైలు, రెండు కొరడా దెబ్బల శిక్ష‌ విధిస్తూ కోర్టు తీర్పు 
  • 'డిస్‌ఇన్‌ఫెక్ట్' చేస్తానంటూ మోసగించి దారుణం
  • ప్రముఖ రాఫెల్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన
సింగపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో స్టాఫ్ మేల్ నర్సుగా పనిచేస్తున్న భారతీయుడు దారుణానికి పాల్పడ్డాడు. పురుషుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అతడిని దోషిగా తేల్చిన స్థానిక కోర్టు.. ఒక సంవత్సరం రెండు నెలల జైలు శిక్షతో పాటు రెండు కొరడా దెబ్బల శిక్ష‌ విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది.

వివరాల్లోకి వెళితే... 34 ఏళ్ల ఏలిపె శివ నాగు సింగపూర్‌లోని రాఫెల్స్ ఆసుపత్రిలో మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది జూన్ 18న ఆసుపత్రిలో చేరిన తన తాతను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుడు పేషెంట్ టాయిలెట్‌ను ఉపయోగిస్తుండగా శివ నాగు గమనించాడు.

ఆ తర్వాత, 'డిస్‌ఇన్‌ఫెక్ట్' చేస్తాననే నెపంతో బాధితుడి వద్దకు వెళ్లి, చేతికి సబ్బు రాసుకుని అతడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా కోర్టుకు తెలిపారు. ఈ అనూహ్య ఘటనతో బాధితుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురై కదలలేకపోయాడని వివరించారు. ఈ సంఘటన తర్వాత బాధితుడు తీవ్ర మానసిక ఆందోళనతో పాటు పదేపదే ఆ దృశ్యాలు గుర్తుకురావడంతో (ఫ్లాష్‌బ్యాక్స్) ఇబ్బంది పడుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడి వివరాలను కోర్టు పత్రాల్లో గోప్యంగా ఉంచారు.

జూన్ 18న ఈ ఘటన జరగ్గా, జూన్ 21న పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండు రోజుల తర్వాత పోలీసులు శివ నాగును అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రి యాజమాన్యం అతడిని నర్సింగ్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు పైవిధంగా శిక్షను ఖరారు చేసింది.
Indian Nurse
Elipilli Siva Nagu
Singapore
Raffles Hospital
sexual assault
jail sentence
caning
crime
court

More Telugu News