Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. మొబైల్ ఫోన్లే ప్రాణాలు తీశాయా?

Kurnool Bus Accident Mobile Phones Sparked Fire Tragedy
  • కర్నూలు బస్సు ప్రమాదంపై దర్యాప్తులో కీలక పురోగతి
  • మంటలు తీవ్రమవడానికి మొబైల్ ఫోన్ల పేలుళ్లే కారణమని ప్రాథమిక అంచనా
  • లగేజీలో ఉన్న 400కు పైగా ఫోన్లు ఒకేసారి పేలినట్లు గుర్తింపు
  • బైక్‌ను ఢీకొట్టడంతో చెలరేగిన నిప్పు లగేజీకి అంటుకున్నట్లు వెల్లడి
  • బ్యాటరీలు పేలడంతో క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించిన మంటలు?
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వందల మొబైల్ ఫోన్లు ఒక్కసారిగా పేలడం వల్లే మంటలు తీవ్రరూపం దాల్చి, భారీ ప్రాణనష్టం సంభవించిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, ప్రమాదానికి గల కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

చిన్నటేకూరు సమీపంలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌ను కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఘర్షణ తలెత్తి నిప్పురవ్వలు చెలరేగాయి. ఆ నిప్పురవ్వలు లీకైన పెట్రోల్‌కు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి.

అయితే, తొలుత ఈ మంటలు బస్సు లగేజీ క్యాబిన్‌కు వ్యాపించాయి. ఆ క్యాబిన్‌లో 400కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్న పార్సిల్ ఉందని అధికారులు గుర్తించారు. మంటలు ఆ పార్సిల్‌కు అంటుకుని, ఫోన్లలోని బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో క్షణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడి లగేజీ క్యాబిన్ పైనున్న ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి.

ఈ ఘటనలో బస్సు ముందు భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలు సేకరించిన ఆధారాలతో పోలీసులు ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు.
Kurnool Bus Accident
Kurnool
bus accident
mobile phones
fire accident
Andhra Pradesh
forensic report
Kaveri travels
road accident

More Telugu News