Air India: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిరిండియాలో సాంకేతిక లోపం

Air India Flight Returns to Delhi Due to Technical Issue
  • ఢిల్లీ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఏఐ-451 విమానం
  • పవర్ యూనిట్ షట్ డౌన్ కావడంతో తిరిగి ఢిల్లీకి మళ్లింపు
  • ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసిన ఎయిరిండియా
ఢిల్లీ-విశాఖపట్నం ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఏఐ-451 విమానంలో ఆక్జిలరీ పవర్ యూనిట్ షట్ డౌన్ అయినట్లు పైలట్ గుర్తించాడు. విమానం గాలిలో ఉండగా ఈ సమస్య తలెత్తడంతో, ఆ పవర్ యూనిట్ ను రీస్టార్ట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా, విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు.

పైలట్లు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని ఢిల్లీకి మళ్లించారని, ఏటీసీ అనుమతి తీసుకుని రన్‌వేపై సురక్షితంగా అత్యవసరం ల్యాండింగ్ చేశారని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానాన్ని వెనక్కి రప్పించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు.

ఢిల్లీలోని తమ సిబ్బంది ప్రయాణికుల పర్యవేక్షణ బాధ్యత తీసుకున్నారని, ఎయిరిండియాలో ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ఎయిరిండియా అధికారి ఒకరు స్పష్టం చేశారు. విశాఖపట్నం వెళ్లాల్సిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేశారు.
Air India
Air India flight
Delhi Visakhapatnam
flight emergency landing
technical issue
AI-451

More Telugu News