Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటర్ల తుది జాబితా విడుదల

Jubilee Hills ByElection Final Voter List Released
  • జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు 
  • ఓటర్లలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు 
  • నోటిఫికేషన్ తర్వాత పెరిగిన 2,383 మంది ఓటర్లు
హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలియజేశారు.

నియోజకవర్గంలో నాలుగు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, వీరిలో 2,08,561 మంది పురుషులు, 1,92,779 మంది మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత జూబ్లీహిల్స్‌లో 2,383 మంది ఓటర్లు పెరిగినట్లు ఆయన తెలిపారు.

ఎన్నికల నేపథ్యంలో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు రూ. 2.84 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, అలాగే రూ. 3.69 లక్షల విలువ చేసే 512 లీటర్ల మద్యం పట్టుకున్నామని తెలిపారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నందున ఒక్కో పోలింగ్ బూత్‌లో నాలుగు బ్యాలెట్ యూనిట్స్, ఒక వీవీప్యాట్ వినియోగిస్తామని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.
Jubilee Hills Election
Hyderabad Elections
RV Karnan
Telangana Elections
Jubilee Hills Voters

More Telugu News