Elon Musk: సిలికాన్ వ్యాలీలో 'సెక్స్ వార్‌ఫేర్'.. ఎలాన్ మస్క్ కామెంట్ వైరల్!

Elon Musk Silicon Valley Sex Warfare Comment Goes Viral
  • సిలికాన్ వ్యాలీలో మహిళా గూఢచారులపై ఎలాన్ మస్క్ వ్యంగ్య వ్యాఖ్య
  • ఆమె ‘10’ అయితే, మీరు ఒక ‘అసెట్’ అంటూ వైరల్ ట్వీట్
  • ‘సెక్స్ వార్‌ఫేర్’ పేరుతో చైనా, రష్యా గూఢచర్యం చేస్తున్నాయని కథనం
  • టెక్ నిపుణులను లక్ష్యంగా చేసుకుని రహస్యాలు రాబడుతున్న వైనం
  • కొందరు స్పైలు పెళ్లిళ్లు చేసుకుని కూడా సమాచారం సేకరిస్తున్నారని ఆరోపణ
  • గంటల వ్యవధిలోనే వైరల్ అయిన మస్క్ పోస్ట్
టెక్ బిలియనీర్, సోషల్ మీడియా సంచలనం ఎలాన్ మస్క్ మరోసారి తనదైన శైలిలో చేసిన ఒకే ఒక్క కామెంట్‌తో వార్తల్లో నిలిచారు. సిలికాన్ వ్యాలీలోని టెక్ రహస్యాలను తస్కరించడానికి మహిళా గూఢచారులు ‘సెక్స్ వార్‌ఫేర్’కు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఓ కథనంపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

‘ది టైమ్స్’ పత్రిక ఇటీవల ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, చైనా, రష్యా వంటి దేశాలు అందమైన మహిళలను గూఢచారులుగా నియమించి సిలికాన్ వ్యాలీకి పంపుతున్నాయని ఆరోపించింది. అక్కడ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో పనిచేసే ఉన్నత స్థాయి నిపుణులను లక్ష్యంగా చేసుకుని, వారితో సంబంధాలు ఏర్పరచుకుని అత్యంత కీలకమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. ఈ పద్ధతిని ‘సెక్స్ వార్‌ఫేర్’గా అభివర్ణించింది. కొందరు మహిళా గూఢచారులు తమ టార్గెట్‌లను పెళ్లి చేసుకోవడం, వారితో పిల్లల్ని కనడం ద్వారా దీర్ఘకాలిక సంబంధాలు నెరుపుతూ రహస్యాలను రాబడుతున్నారని వివరించింది.

ఈ కథనం హెడ్‌లైన్‌ను గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేసిన ఎలాన్ మస్క్, దానికి తనదైన శైలిలో ఒక వ్యాఖ్యను జోడించారు. ‘‘ఆమెకు పదికి పది మార్కులు వేస్తే, ఇక మీరు ఒక ఆస్తి’’ అంటూ చమత్కరించారు.

మస్క్ చేసిన ఈ చిన్న కామెంట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ సంపాదించింది. నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందించారు. కొందరు మీమ్స్, జోకులతో సరదాగా స్పందించగా, మరికొందరు మాత్రం అసలు కథనంలోని తీవ్రతను, గూఢచర్యం వల్ల ఎదురయ్యే ముప్పును ప్రస్తావిస్తూ సీరియస్‌గా కామెంట్లు చేశారు. సిలికాన్ వ్యాలీలో కార్పొరేట్ గూఢచర్యం, సైబర్ దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ కథనం తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.
Elon Musk
Silicon Valley
Sex Warfare
Tech Billionaire
Social Media
China
Russia
Cyber Attacks
Corporate Espionage
The Times

More Telugu News