Tuni Minor Girl Assault Case: అతను చావడమే కరెక్ట్.. తుని అత్యాచార కేసు నిందితుడి మృతిపై కుటుంబ సభ్యులు

Tuni Rape Accused Narayana Rao Found Dead Family Says Good Riddance
  • తుని బాలిక అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు మృతి
  • చెరువులో తేలిన మృతదేహం
  • అతను చావడమే సరైందంటూ కుటుంబ సభ్యుల వ్యాఖ్య 
  • చేసిన పాపానికి శిక్ష పడాల్సిందేనన్న కొడుకు, కూతురు
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తుని బాలిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నారాయణరావు (62) మరణించాడు. స్థానిక చెరువులో అతని మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. అయితే, అతని మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకోవడం మాట అటుంచి, "అలాంటి వాడు చావడమే కరెక్ట్" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన నారాయణరావు చెరువులో శవమై తేలాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. శవ పంచనామా పత్రాలపై కుటుంబ సభ్యుల సంతకాలు అవసరం కాగా, ఇందుకు అతని ఇద్దరు భార్యలు సహా కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు.

ఈ సందర్భంగా నిందితుడి కుమారుడు సురేశ్, కోడలు రాజేశ్వరి మాట్లాడుతూ, "నారాయణరావు చనిపోయాడని పోలీసులు ఫోన్ చేసి చెప్పారు. అతను చేసిన పనికి చావడమే సరైందని మేము భావిస్తున్నాం" అని అన్నారు. నిందితుడి కుమార్తె నాగలక్ష్మి కూడా ఇదే విధంగా స్పందించారు. "అతను చేసిన తప్పుకు శిక్ష పడాల్సిందే. అందుకే పోలీసులు అరెస్టు చేసినప్పుడు కూడా మేము స్టేషన్ వైపు కన్నెత్తి చూడలేదు" అని ఆమె తెలిపారు.
Tuni Minor Girl Assault Case
Narayana Rao
Tuni rape case
Andhra Pradesh crime
Child abuse India
Tuni death
Crime news Telugu
Suicide investigation
East Godavari district
Family reaction
Rape accused death

More Telugu News