Prabhas: సంక్రాంతి రేసులోకి కలర్‌ఫుల్‌గా రాబోతున్న 'రాజాసాబ్‌'

Rajasab Set to Enter the Sankranti Race in a Colourful Manner
  • సంక్రాంతి రేసులో ప్రభాస్‌ 'రాజాసాబ్‌' 
  • ఈ సారి రిలీజ్‌ డేట్‌ పక్కా అంటోన్న యూనిట్‌ 
  • ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా కలర్‌ఫుల్‌ పోస్టర్‌ విడుదల 
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు సాధించిన భారీ విజయాలతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ ఆ తరువాత ఏ సినిమా చేసిన ఇండియా లెవల్‌లో ఆ చిత్రంపై అందరి అటెన్షన్‌ ఉంటుంది. ఇటీవల 'కల్కి..'తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం 'రాజాసాబ్‌' చిత్రంతో పాటు 'ఫౌజీ' చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్‌ 23న గురువారం ఈ రెబల్‌స్టార్‌ పుట్టినరోజు సందర్బంగా 'రాజాసాబ్‌'నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేయడంతో పాటు చిత్రాన్ని జనవరి 9న సంక్రాంతి రేసులో విడుదల చేస్తున్నట్లుగా మరోసారి కన్‌ఫర్మ్‌ చేశారు మేకర్స్. 

ఈ పోస్టర్‌ కలర్‌ఫుల్‌గా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. మేళతాళాలతో ప్రభాస్‌ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్నట్లు ఉన్న ఈ పోస్టర్‌ను చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. మారుతి దర్శకత్వంలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్‌ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

హారర్ కామెడి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇటీవల యూరప్‌లో చివరి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుందని తెలిసింది. ఇక 2026 సంక్రాంతికి  'రాజాసాబ్‌'తో పాటు మెగాస్టార్‌ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌ గారు', నవీన్‌ పొలిశెట్టి 'అనగనగా ఒకరాజు', రవితేజ 'ఆర్‌టీ 76' సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. 

Prabhas
Raja Saab
Maruthi
Sankranti 2026
Malavika Mohanan
Nidhhi Agerwal
Riddhi Kumar
People Media Factory
Telugu Movies
Pan India Star

More Telugu News