KCR: పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ

KCR Focuses on Jubilee Hills By Election BRS Strategy
  • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చ
  • హాజరైన హరీశ్‌రావు సహా పలువురు మాజీ మంత్రులు, ముఖ్య నేతలు
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పార్టీకి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు.

ఈ కీలక సమావేశానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి వంటి ముఖ్య నేతలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా ఇంటింటి ప్రచారం, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరే నాయకుల అంశాలపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించినట్టు సమాచారం. ఉప ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరినీ సమాయత్తం చేయాలని ఈ సమావేశంలో కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. 
KCR
BRS Party
Jubilee Hills by-election
Telangana politics
Harish Rao
Jagadish Reddy
Errabelli Dayakar Rao
Talasanai Srinivas Yadav
Telangana elections

More Telugu News