Virat Kohli: కోహ్లీ మళ్లీ డకౌట్.. వరుసగా రెండో వన్డేలోనూ అదే సీన్.. ఇదిగో వీడియో!

Virat Kohli Continues Poor Form with Another Duck Against Australia
  • ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లీ డకౌట్
  • ఈ సిరీస్‌లో వరుసగా రెండోసారి సున్నాకే వెనుదిరిగిన విరాట్
  • బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన కోహ్లీ
  • అదే ఓవర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా పెవిలియన్ బాట
  • టీమిండియాకు ఒకే ఓవర్లో ఎదురైన రెండు భారీ షాక్‌లు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ ప‌రుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. వన్ డౌన్‌గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ, కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ సున్నాకే ఔటవడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం.

ఆసీస్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో విరాట్ ఇలా సున్నాకే పెవిలియ‌న్ చేరాడు. బార్ట్‌లెట్ విసిరిన బంతికి కోహ్లీ వికెట్ల ముందు (ఎల్బీడబ్ల్యూగా) దొరికిపోయాడు. బంతి నేరుగా వికెట్లను తాకేలా ఉండటంతో కోహ్లీ రివ్యూ కూడా తీసుకోకుండా నిరాశగా మైదానాన్ని వీడాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ డకౌట్ అయిన విషయం తెలిసిందే. తనకు బాగా అచ్చొచ్చిన అడిలైడ్ మైదానంలో కూడా విఫలమవడం అభిమానులను కలవరానికి గురిచేసింది.

భారత్‌కు ఒకే ఓవర్లో రెండు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కోహ్లీ ఔటవడానికి కొన్ని బంతుల ముందే, అదే ఓవర్లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మైదానం నుంచి వెళ్లే క్రమంలో కోహ్లీ బౌండరీ లైన్ వద్ద ప్రేక్షకులకు తన గ్లోవ్స్‌తో అభివాదం చేస్తూ కనిపించాడు.

తాజా సమాచారం అందేసరికి, టీమిండియా 20 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (44), శ్రేయాస్ అయ్యర్ (31) బ్యాటింగ్ చేస్తున్నారు.
Virat Kohli
Virat Kohli duck
India vs Australia
Shubman Gill
Javier Bartlett
Adelaide ODI
India cricket
cricket news
Rohit Sharma
Shreyas Iyer

More Telugu News