వచ్చే నెలలో కొలంబోకు వెళుతున్న కేటీఆర్
- కొలంబోలో గ్లోబల్ టెక్ సదస్సులో పాల్గొననున్న మాజీ మంత్రి
- కీలక ప్రసంగం చేయాల్సిందిగా శ్రీలంక ప్రభుత్వం నుంచి ఆహ్వానం
- నవంబర్ 10 నుంచి 12 వరకు సదస్సు నిర్వహణ
నవంబర్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబోలోని ‘ది కింగ్స్‌బరీ హోటల్’లో ఈ సదస్సు జరగనుంది. కేటీఆర్ ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలకు చెందిన విధాన రూపకర్తలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు, అగ్రశ్రేణి నాయకులు పాల్గొననున్నారు. ఇలాంటి కీలకమైన సదస్సులో ప్రసంగించేందుకు కేటీఆర్‌కు ఆహ్వానం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన నవంబర్ 10న శ్రీలంకకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.