Chandrababu Naidu: నేడు అబుదాబీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా...

Chandrababu Naidus Abu Dhabi Tour Schedule Today
  • అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
  •  పెట్టుబడులపై స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం
  • నేడు తొమ్మిది సమావేశాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
పెట్టుబడులను ఆకర్షించేందుకు దుబాయ్, యూఏఈలలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (గురువారం) అబుదాబీలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఉదయం 10.15 నిమిషాలకు దుబాయ్ నుంచి అబుదాబీకి చేరుకున్న అనంతరం, అబుదాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో ఆయన సమావేశమవుతారు. అబుదాబీలోని అల్ మైరాహ్ ఐలాండ్‌లో ఉన్న ఏడీజీఎ స్క్వేర్‌లో ఈ సమావేశం జరగనుంది. జీ 42 సీఈఓ మన్సూర్ అల్ మన్సూరీతో కూడా ముఖ్యమంత్రి సమావేశమవుతారు.

అనంతరం అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలిత్, లాజిస్టిక్స్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీమ్ అల్ మసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ అల్ మజ్రోయి, జాయేద్ అల్ షాయేయా, సయీద్ అల్ అమేరి తదితరులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

తదుపరి అబుదాబీలోని స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం అబుదాబీ పెట్టుబడుల విభాగం చైర్మన్ ఖలీఫా ఖౌరీతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. లులూ గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతో కూడా ముఖ్యమంత్రి సమావేశమై విశాఖ, విజయవాడలలో లులూ మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రంపై చర్చించనున్నారు.

ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న అగితా గ్రూప్ సీఈఓ సల్మీన్ అల్మెరీతో కూడా ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. అబుదాబీలోని మస్దార్ సిటీ సీఈఓ మహ్మద్ జమీల్ అల్ రమాహితో సమావేశమవుతారు. అనంతరం యాస్ ఐలాండ్‌లోని పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ఆ సంస్థ సీఈఓ మహ్మద్ అబ్దల్లా అల్ జాబీతో భేటీ కానున్నారు. ఈ సమావేశం అనంతరం భారత కాన్సుల్ జనరల్ నివాసంలో ముఖ్యమంత్రి గౌరవార్ధం ఇచ్చే విందుకు చంద్రబాబు హాజరవుతారు. నేడు మొత్తం 9 సమావేశాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Abu Dhabi
UAE
Investments
Lulu Group
Food Processing Park
Masdar City
Tourism Projects
AP CM

More Telugu News