Gold Prices: ఒక్కరోజే రూ. 9 వేలు తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధర

Gold Prices Drop Sharply by Rs 9000 in Hyderabad
  • హైదరాబాద్‌లో రూ. 1,25,250కి పడిపోయిన పసిడి ధరలు
  • రూ. 28 వేలు తగ్గి రూ. 1,58,000కు పడిపోయిన వెండి ధర
  • అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4,022 డాలర్లు
బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం తులం రూ. 1,30,000 దాటి రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర ప్రస్తుతం తగ్గుతోంది. హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,250కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ. 1,14,843గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర దాదాపు రూ. 9 వేలు తగ్గింది.

వెండి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. బుధవారం సాయంత్రానికి కిలో వెండి రూ. 7 వేలు తగ్గి, రూ. 1,58,000కి చేరింది. వారం రోజుల్లో వెండి ధర రూ. 28 వేలు తగ్గడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 4,022 డాలర్లకు పడిపోయింది. వెండి ధర 47.84 డాలర్లకు చేరింది. అమెరికాలో షట్ డౌన్, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ధరలు నిత్యం సరికొత్త గరిష్ఠ స్థాయిలను తాకాయి. విలువైన లోహాలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపారు. దీనికి తోడు డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం కూడా కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Gold Prices
Hyderabad
Silver Prices
Gold Rate Today
Silver Rate Today
Commodity Market
Bullion Market

More Telugu News