Deepika Padukone: దీపిక, రణ్ వీర్ ల కూతురును చూశారా.. ఫొటో ఇదిగో!

Deepika Ranveer Share First Photo of Daughter Dua
  • దీపావళి వేడుకల సందర్భంగా ఫ్యామిలీ ఫొటోను పంచుకున్న నటి
  • కూతురు దువా ఫొటోతో అభిమానులకు శుభాకాంక్షలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో.. క్యూట్ గా ఉందంటున్న నెటిజన్లు
బాలీవుడ్ సెలబ్రెటీ జంట దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ తమ కూతురు ‘దువా’ను ప్రపంచానికి పరిచయం చేశారు. తొలిసారి కూతురు ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం పంచుకున్నారు. దీపావళి వేడుకల ఫొటోలతో పాటు కూతురు దువా ఫొటోను రివీల్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాప చాలా క్యూట్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
 
గతేడాది సెప్టెంబర్ లో దీపిక, రణ్ వీర్ జంటకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే. పాపకు దువా అని నామకరణం చేసినట్లు వెల్లడించిన ఈ జంట.. ఇప్పటి వరకూ కూతురిని మీడియాకు కానీ, సోషల్ మీడియాలో ఫొటోలను కానీ పంచుకోలేదు. ఇతర సెలబ్రిటీలలాగే వీరు కూడా తమ బిడ్డ ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తూ “నో ఫొటో పాలసీ”ని అనుసరిస్తూ వ‌చ్చారు.

ఓసారి దీపిక తన కూతురుతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించ‌గా వీడియా తీసేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కూతురు ప్రైవసీని గౌరవించాలని కోరారు. అంతేకాదు, అప్పటి వరకు రికార్డు చేసిన వీడియోను తొలగించేలా సదరు మీడియా సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. అయితే, ఇన్నాళ్లు త‌మ కూతురి ఫేస్‌ ను సీక్రెట్‌గా ఉంచిన దీపిక‌, ర‌ణ్‌వీర్ సింగ్ జంట దీపావ‌ళి పండుగ‌ని పుర‌స్క‌రించుకొని కూతురు దువాతో క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్‌ మీడియాలో షేర్ చేసి అభిమానులతో త‌మ ఆనందాన్ని పంచుకున్నారు.

Deepika Padukone
Ranveer Singh
Dua
Deepika Ranveer daughter
Bollywood celebrity
Diwali celebrations
celebrity baby photos
Indian celebrity news
Bollywood news
Dua photo

More Telugu News