Naresh: నిర్మాతలపై సీనియర్ నటుడు నరేశ్ వ్యాఖ్యలు

Naresh Comments on Producers at KRamp Success Meet
  • కిరణ్ అబ్బవరం నటించిన కె ర్యాంప్ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న సీనియర్ నటుడు నరేశ్ 
  • నిర్మాతలు కళాకారులకు కేవలం పారితోషికం ఇస్తే సరిపోతుందని భావిస్తుంటారన్న నరేశ్
  • కళాకారులకు గౌరవం కూడా ఇవ్వాలన్న నరేశ్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కె రాంప్ సినిమా విజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో సీనియర్ నటుడు నరేశ్ నిర్మాతల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

నరేశ్ మాట్లాడుతూ, “నేను రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఈ కాలంలో 200లకు పైగా నిర్మాతలను చూశాను. చాలా మంది నిర్మాతలు కళాకారులకు కేవలం పారితోషికం ఇస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ కష్టపడి పనిచేసే వారికి డబ్బుతో పాటు గౌరవం కూడా ఇవ్వాలి” అని అన్నారు.

అదే సమయంలో ఈ సినిమా నిర్మాత రాజేశ్‌ను ప్రశంసిస్తూ, “ఆయన ఆర్టిస్టులను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం” అని తెలిపారు.

కిరణ్ అబ్బవరం సినిమా హిట్ కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన నరేశ్.. “యంగ్ టీం ఎప్పుడూ కష్టపడి పనిచేస్తుంది. ఈ సినిమా విజయం దానికి నిదర్శనం” అని పేర్కొన్నారు. కాగా, నిర్మాతలపై నరేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. 
Naresh
Kiran Abbavaram
KRamp Movie
Telugu Cinema
Telugu Film Industry
Producer Rajesh
Movie Success Meet
Tollywood
Film Actors
Movie Producers

More Telugu News