Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తుల ఇక్కట్లు.. వీడియో ఇదిగో!

Tirumala Heavy Rain Disrupts Devotees Life Video
––
తిరుమలలో ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుమల కొండను వర్షం ముంచెత్తింది. ఓవైపు వర్షం, మరోవైపు చలితో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి నామ స్మరణ చేస్తూ నిత్యం భక్తులతో కిటకిటలాడే మాడవీధులు ప్రస్తుతం బోసిపోయాయి. వర్షం కారణంగా భక్తులు షెడ్ల కింద తలదాచుకుంటున్నారు.

శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన భక్తులు తమ కాటేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్న పిల్లలు, వృద్ధులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ సూచించింది. కాగా, వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్ లలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, సొంత వాహనాలలో వస్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ శాఖ హెచ్చరించింది.
Tirumala
Tirumala rain
Tirumala weather
Heavy rain
Tirumala devotees
TTD
Ghat road
Landslide alert
Bay of Bengal depression

More Telugu News