Empalli Pramod Kumar: నేరస్తుడు రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా

Constable Empalli Pramod Kumar Family Receives 1 Crore Ex Gratia
  • రౌడీ షీటర్ రియాజ్ చేతిలో నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య
  • ప్రమోద్ కుమార్ కుటుంబానికి భారీ ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్
  • ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందన్న డీజీపీ
రౌడీ షీటర్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. మొత్తం రూ.1.24 కోట్ల పరిహారంతో పాటు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

జీవో ఆర్టీ నంబర్ 411 ప్రకారం ప్రమోద్ కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నారు. అమరుడైన ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే జీవో 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తారని వెల్లడించారు. అదనంగా పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.8 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు.

"విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీతకు, ముగ్గురు కుమారులకు ప్రభుత్వం, పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది. తెలంగాణలో చట్టం, శాంతి భద్రతను కాపాడేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉంది. ఎలాంటి నేరస్తులైనా కఠినంగా అణచివేస్తాం" అని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.

ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సాయంతో పాటు న్యాయపరమైన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని పోలీస్ శాఖ తెలిపింది. 
Empalli Pramod Kumar
Nizamabad CCS Constable
Telangana Police
Riyaz
Constable Murder
Ex Gratia
Shivadhar Reddy DGP
Telangana Government
Crime News
Police Welfare Fund

More Telugu News