Vishal: ఇక ఆ విషయం రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు: దీపావళి వేళ విశాల్ కీలక ప్రకటన

Vishal Announces Direction of Makutum Movie on Diwali
  • విశాల్ హీరోగా రవి అరసు దర్శకత్వంలో ప్రారంభమైన 'మకుటం' చిత్రం
  • దర్శకుడితో విభేదాలు.... ఇక తానే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు విశాల్ ప్రకటన
  • విషయం బహిర్గతం చేసే సమయం వచ్చిందని వెల్లడి 
నటుడు విశాల్ 'మకుటం' చిత్రానికి సంబంధించి సరికొత్త ప్రకటన చేశారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విశాల్ హీరోగా దర్శకుడు రవి అరసు ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత దర్శకుడితో విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తానే తెరకెక్కించాలని విశాల్ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, దీపావళి సందర్భంగా విశాల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

'మకుటం' చిత్రానికి సంబంధించిన విషయాన్ని బహిర్గతం చేయడానికి ఇది సరైన సమయమని, ఇకపై ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రత్యేక సందర్భంలో సినిమా గురించి మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 'మకుటం' చిత్రం సెకండ్ లుక్‌ను మీతో పంచుకోవడం సంతోషంగా ఉందని, అయితే ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తానని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు.

పరిస్థితులకు అనుగుణంగా బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. సినిమా అంటేనే ఒక నిబద్ధత అని, కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బాధ్యతలను స్వీకరించినట్లు అవుతుందని అన్నారు. తమను ఆదరించే ప్రేక్షకులు నమ్మకాన్ని, పెట్టుబడి పెట్టిన నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. ఈ సినిమా కోసం ఒక నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Vishal
Vishal Makutum
Makutum Movie
Vishal Direction
Ravi Arasu
Telugu Movies
Diwali Announcement

More Telugu News