Sanjay Kumar: ఎమ్మెల్యే సంజయ్‌పై మంత్రికి జీవన్ రెడ్డి ఫిర్యాదు.. పదేళ్లు దోచుకున్నోడి మాటే వింటారా అంటూ ఫైర్!

Jeevan Reddy Complains Against MLA Sanjay Kumar to Minister
  • వలస నేతలు చెబితేనే పనులు చేస్తారా అని జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
  • పదేళ్ల దోపిడీ అనుభవం ఉందంటూ సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు
  • పార్టీ ఫిరాయించిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని తీవ్ర ఆవేదన
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహారశైలిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తూ, మొదటి నుంచి ఉన్న వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు నేరుగా ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఎదుట తన అసంతృప్తిని వెళ్లగక్కిన జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "వలస వచ్చిన వాళ్లు చెబితేనే పనులు చేస్తారా? మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులు చెబితే పనులు చేయరా?" అని ఆయన మంత్రిని నిలదీశారు. పార్టీ ఫిరాయించి వచ్చిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మరింత ఘాటుగా స్పందిస్తూ, "ఆయనకు పదేళ్లు దోచుకున్న అనుభవం ఉందని ఆయన మాటలే వింటారా?" అంటూ ఎమ్మెల్యే సంజయ్‌ను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారికి పెద్దపీట వేయాలనే నిబంధన ఏదైనా పెట్టారా అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అసలు సిద్ధాంతం ఏంటో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న తమ లాంటి వారిని పట్టించుకోకపోవడం లేదంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 
Sanjay Kumar
Jeevan Reddy
Adluri Laxman
Jagityal MLA
Congress Party
Telangana Politics
Party Defection
Internal Disputes
Telangana Congress
Political News

More Telugu News