సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ భేటీ
- తిరుమల ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లపై ప్రధానంగా చర్చ
- దాదాపు అరగంట సేపు సాగిన భేటీ
- భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎంకు వివరణ
దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో, ముక్కోటి ఏకాదశికి భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై వారిద్దరూ చర్చించుకున్నారని సమాచారం. దర్శనం, వసతి, ప్రసాదాల వితరణ వంటి అంశాల్లో పకడ్బందీగా వ్యవహరించాలని సీఎం సూచించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా, తిరుమలలో భక్తులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాలు, వాటిని మరింత మెరుగుపరిచేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి టీటీడీ చైర్మన్ ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. శ్రీవారి ఆలయానికి సంబంధించిన ఇతర పాలనాపరమైన అంశాలు కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.