Kiran Mazumdar Shaw: కిరణ్ మజుందార్ షాపై డీకే శివకుమార్ వ్యాఖ్యలు.. స్పందించిన పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా

Kiran Mazumdar Shaw responds to DK Shivakumars comments
  • బెంగళూరు రహదారులపై కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలు
  • వ్యంగ్యంగా స్పందించిన డీ.కే. శివకుమార్
  • మజుందార్ షా వ్యాఖ్యలను రాజకీయం చేయడం సరికాదన్న హర్ష్ గోయెంకా
బెంగళూరు రహదారుల దుస్థితిపై 'ఎక్స్' వేదికగా బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా స్పందించిన తీరుకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా మద్దతు తెలిపారు. బెంగళూరు రహదారులపై విదేశీ అతిథులు చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బంది పడ్డానని మజుందార్ షా పేర్కొన్నారు.

ఈ విషయంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యంగా స్పందిస్తూ, రోడ్లు బాగు చేయించడానికి నిధులు ఇస్తామని, బాగు చేయించాలని ఆమెను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత రాజకీయ అజెండాతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

మన రాజకీయ నాయకులు విమర్శలను సానుకూలంగా స్వీకరించకపోవడం దురదృష్టకరమని హర్ష్ గోయెంకా 'ఎక్స్' వేదికగా అభిప్రాయపడ్డారు. బెంగళూరులో క్షీణిస్తున్న మౌలిక సదుపాయాల గురించి కిరణ్ మజుందార్ షా మాట్లాడారని, ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి నేతలు దానిపై రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అనుకూల పోస్టులు పెట్టాలని ఆమెను బలవంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలపై దృష్టి సారించకుండా, విమర్శలు చేస్తున్న వారిపై దాడి చేయడం సర్వసాధారణంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
Kiran Mazumdar Shaw
DK Shivakumar
Harsh Goenka
Biocon
Bangalore roads
Karnataka
Infrastructure

More Telugu News