Priyanka Jain: పెళ్లికి ముందే కోటి లోన్‌తో ఇంటి నిర్మాణం.. ప్రియాంక, శివకుమార్ కొత్త ప్రయాణం!

Priyanka Jain and Shiva Kumar Building Dream Home with Loan
  • పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్న ప్రియాంక, శివకుమార్
  • కొత్త ఇల్లు తమ కలల సౌధం అన్న ప్రియాంక జైన్
  • గత ఏడాదే ఇంటి కోసం స్థలం కొనుగోలు
‘మౌనరాగం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి ప్రియాంక జైన్, తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే దిశగా కీలక అడుగు వేశారు. పెళ్లికి ముందే ఈ జంట ఏకంగా కోటి రూపాయల లోన్ తీసుకుని తమ కలల ఇంటిని నిర్మించుకుంటోంది. ఈ విషయాన్ని ప్రియాంక స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న తమ ఇంటి వీడియోను షేర్ చేస్తూ ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు.

గత ఏడాది కొనుగోలు చేసిన స్థలంలో తాము ఇల్లు కట్టుకుంటున్నట్లు ప్రియాంక తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘కోటి రూపాయల లోన్‌తో ఇల్లు కట్టుకుంటున్నాము. ఇది కేవలం ఇటుకలతో కాదు.. ఎన్నో ఆశలతో, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు, జీవితకాల జ్ఞాపకాల సమాహారానికి పునాది పడింది. ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇది మా శాశ్వత నివాసం’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రియుడు శివకుమార్‌తో కలిసి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

గత కొంతకాలంగా ప్రియాంక, శివకుమార్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్న ఈ జంట, సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఇంటి నిర్మాణంపైనే పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, ఇంటి నిర్మాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు వారికి శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు 'ముందు పెళ్లి చేసుకోండి' అంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ జంట మాత్రం తమ కలల ఇంటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది. 
Priyanka Jain
Mounaragam serial
Shiva Kumar
Telugu actress
House construction
Home loan
Priyanka Shiva Kumar
Couple building house
Telugu serial actress
Viral video

More Telugu News