Deepti Sharma: ఇంగ్లాండ్ తో మ్యాచ్​ ఓడినా దీప్తి శర్మ రికార్డు.. తొలి ఇండియన్ ఉమెన్ క్రికెటర్

Deepti Sharma Creates Record in Womens Cricket Despite Loss to England
  • వన్డే క్రికెట్ లో 2 వేల పరుగులు, 150 వికెట్లు తీసిన నాలుగో ఉమన్ క్రికెటర్
  • వన్డేల్లో 2,600 పరుగులు చేసిన దీప్తి శర్మ
  • 4 వేల పరుగులు, 166 వికెట్లతో తొలి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ
భారత మహిళా క్రికెట్ లో దీప్తి శర్మ మరో రికార్డు సృష్టించింది. వన్డేల్లో 2 వేల పరుగులు, 150 వికెట్లు తీసిన తొలి భారత ఉమన్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో నాలుగో ఉమన్ క్రికెటర్ గా నిలిచింది. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ టాప్ లో ఉంది. పెర్రీ వన్డే క్రికెట్ లో 4,414 పరుగులు చేసి, 166 వికెట్లు తీసింది.
 
ఐసీసీ ఉమన్స్ వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో దీప్తి శర్మ అదరగొట్టింది. అటు బంతితో, ఇటు బ్యాట్ తో తన సత్తా చాటింది. పది ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులకు నలుగురు బ్యాట్స్‌ ఉమెన్ ను ఔట్ చేసింది. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడంతో దీప్తి 150 వికెట్ల మైలురాయిని చేరుకుంది. తర్వాత బ్యాటింగ్ లోనూ అదరగొట్టిన దీప్తి.. హాఫ్ సెంచరీ చేసి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించింది. అయితే, ఈ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలైంది.

మహిళల క్రికెట్ లో వన్డేల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ 4,414 పరుగులు చేసి, 166 వికెట్లు తీసి టాప్ లో ఉంది. పెర్రీ తర్వాతి స్థానంలో 5,873 పరుగులు, 155 వికెట్లతో వెస్టిండీస్‌కు చెందిన స్టెఫానీ టేలర్, 3,397 పరుగులు, 172 వికెట్లతో దక్షిణాఫ్రికాకు చెందిన మారిజాన్ కాప్ ముందున్నారు.
Deepti Sharma
Indian women cricket
Deepti Sharma record
Women's ODI cricket
2000 runs 150 wickets
Ellyse Perry
ICC Women's World Cup
India vs England
Cricket records
Women in cricket

More Telugu News