ట్రంప్ హత్యకు మరో కుట్ర..!
- విమానం ఎక్కుతుండగా కాల్పులు జరిపేందుకు ఏర్పాట్లు
- పామ్ బీచ్ ఎయిర్ పోర్టు సమీపంలో స్నైపర్ హైడవుట్
- భద్రతా తనిఖీల్లో గుర్తించి అప్రమత్తమైన ట్రంప్ భద్రతా సిబ్బంది
- ట్రంప్ ను విమానం వెనక వైపు నుంచి లోపలికి పంపించిన వైనం
ట్రంప్ విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఆగే చోటుకు దాదాపు 200 గజాల దూరంలో ఓ చెట్టుపై స్నైపర్ (దూరం నుంచి గురితప్పకుండా కాల్పులు జరిపే వ్యక్తి) దాక్కునేందుకు చేసుకున్న ఏర్పాట్లను ట్రంప్ భద్రతా సిబ్బంది గుర్తించి అప్రమత్తమయ్యారు. దుండగులు ఓ చెట్టుకు నిచ్చెన అమర్చి.. వేటగాళ్లు ఎదురుచూసేలా గూడు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతుండగా గూడులో నుంచి కాల్పులు జరిపేలా ఏర్పాట్లు ఉండడంతో వెంటనే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ట్రంప్ ను విమానం ముందు నుంచి కాకుండా వెనక వైపు చిన్న మెట్లు అమర్చి లోపలికి పంపించారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు జరుపుతోంది.