Pooja Mishra: పోలీస్ స్టేషన్ లోనే మణికట్టు కోసుకున్న మహిళ.. ట్విస్ట్ మామూలుగా లేదు

UP Woman Attempts Suicide in Police Station After Affair Ends
  • ఇద్దరు పిల్లల తల్లైనా భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం
  • భర్త, పిల్లలను వదిలేసి ఏడు నెలల పాటు సహజీవనం
  • ఇకపై కలిసి ఉండలేనని చెప్పడంతో ఆత్మహత్యాయత్నం చేసిన అత్త
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. పోలీసుల సమక్షంలోనే బ్లేడ్ తో చేతిని కోసుకోవడంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. భర్త మేనల్లుడు తనతో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి ముగింపు పలకడమే సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి కారణం కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఢిల్లీకి చెందిన పూజా మిశ్రా యూపీకి చెందిన లలిత్ కుమార్ మిశ్రాను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వయసు ఏడేళ్లు కాగా చిన్నవాడి వయసు ఆరేళ్లు. లలిత్ మిశ్రా తన పనికి సాయంగా ఉంటాడనే ఉద్దేశంతో మేనల్లుడు అలోక్ మిశ్రాను తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో పూజ తనకంటే పదిహేను సంవత్సరాలు చిన్నవాడైన అలోక్ తో వివాహేతర బంధం పెట్టుకుంది. ఈ విషయం బయటపడడంతో లలిత్ తన మేనల్లుడు అలోక్ ను ఇంట్లో నుంచి పంపించేశాడు. అలోక్ ను విడిచి ఉండలేక పూజ కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.

భర్తను, పిల్లలను వదిలి ప్రియుడి కోసం బరేలీ చేరుకుంది. అక్కడ అలోక్, పూజ దాదాపు ఏడు నెలల పాటు సహజీవనం చేశారు. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో అలోక్ తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. బరేలీలో ఒంటరిగా ఉండలేక పూజ కూడా తిరిగి వచ్చింది. తనతో కలిసి ఉండాలంటూ అలోక్ తో గొడవకు దిగింది. 

ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరగా.. పూజతో ఇకపై బంధాన్ని కొనసాగించలేనని అలోక్ స్పష్టం చేశాడు. ఇది తట్టుకోలేక పూజ తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే పోలీసులు పూజను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Pooja Mishra
Uttar Pradesh
extra marital affair
suicide attempt
police station
Alok Mishra
Seetapur
Bareilly
crime news

More Telugu News