Allu Arjun: అల్లు అర్జున్ - అట్లీ మూవీపై రణ్‌వీర్ సింగ్ ప్రశంసలు

Ranveer Singh Praises Allu Arjun Atlee Movie
  • అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడిగా అట్లీ గుర్తింపు తెచ్చుకున్నారన్న రణ్‌వీర్ సింగ్ 
  • ఆయన దర్శకత్వంలో వర్క్ చేయడం కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడి 
  • ఇప్పటి వరకు చూడని అద్భుతాన్ని అట్లీ చూపించబోతున్నారన్న రణ్‌వీర్
అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘AA 22’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లోనే కాకుండా, ఇండస్ట్రీలో కూడా చర్చ జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తించాయి.

రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రణ్‌వీర్ ఈ సినిమా షూటింగ్ సెట్‌ను సందర్శించగా, తన అనుభవాన్ని పంచుకుంటూ అట్లీని, అల్లు అర్జున్‌ను ఆకాశానికెత్తేశాడు.

అట్లీ జవాన్ సినిమాతో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారన్నారు. భారతదేశంలో అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మెర్సల్’ సినిమా చూశాకనే తాను ఆయనకు మెసేజ్ చేసి, ‘మీతో సినిమా చేయాలనుంది, ముంబయికి రండి' అని ఆహ్వానించానన్నారు. ఆయన దర్శకత్వంలో పని చేయడం కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అట్లీతో పనిచేయడం అంటే ఒక కొత్త అనుభవం. ఆయనతో ఉంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.

ఇటీవల అల్లు అర్జున్ సినిమా షూటింగ్ సెట్‌కు వెళ్లానని, ఆ సెట్ చూసి ఆశ్చర్యపోయానని రణ్‌వీర్ చెప్పారు. “మీరు ఇప్పటివరకు చూడని ఓ అద్భుతాన్ని అట్లీ చూపించబోతున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇంత భారీ స్థాయి ప్రాజెక్ట్ ఇప్పటివరకు రాలేదు’’ అని రణ్‌వీర్ సింగ్ పేర్కొన్నారు. 
Allu Arjun
AA22
Atlee
Ranveer Singh
Deepika Padukone
Pan India Movie
Bollywood
Indian Cinema
Jawan Movie
Director Atlee

More Telugu News