Samantha: ఒకప్పుడు తిండికే కష్టం.. నా గతాన్ని ఎప్పటికీ మర్చిపోలేను: సమంత

Samantha recalls her difficult past
  • ఒకప్పుడు తినడానికి కూడా తమ కుటుంబం ఇబ్బంది పడిందన్న సమంత
  • సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచే తాను వచ్చానని వ్యాఖ్య
  • మొదటి సినిమాతో వచ్చిన స్టార్‌డమ్‌ను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని వెల్లడి
స్టార్ హీరోయిన్ సమంత తన పాత రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం అగ్ర కథానాయికగా విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ, తాను వచ్చిన దారిని, పడిన కష్టాలను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తన కుటుంబం ఒకప్పుడు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను పంచుకున్నారు.

"నేను ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మా కుటుంబం పడిన కష్టాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఒకానొక సమయంలో పూట గడవడానికే మేం చాలా ఇబ్బంది పడ్డాం. తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు" అంటూ సమంత తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన తనకు, మొదటి సినిమాతోనే ఊహించని విజయం దక్కిందని తెలిపారు.

తన తొలి చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయానని, ఒక్కసారిగా వచ్చిన పేరు, డబ్బు, అభిమానుల చప్పట్లను చూసి మొదట్లో తికమకపడ్డానని ఆమె అన్నారు. "అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పును ఎలా స్వీకరించాలో నాకు అర్థం కాలేదు. కానీ, నేను ఎప్పుడూ పొంగిపోలేదు. ఎందుకంటే నేను సినిమాల్లోకి ఓ గొప్ప లక్ష్యంతో వచ్చాను. అదే నన్ను ముందుకు నడిపించింది. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, కష్టపడి పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుందని నమ్మి ముందుకు సాగాను" అని సమంత వివరించారు. 
Samantha
Samantha Ruth Prabhu
Samantha interview
Telugu actress
Tollywood
Samantha family
Samantha struggles
Samantha early life
actress Samantha
Indian actress

More Telugu News