Aashu: నడిరోడ్డుపై జంట హత్యలు... ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ సీన్!

Double Murder in Delhi Over Affair Crime Scene
  • ఢిల్లీలో నడిరోడ్డుపై గర్భిణి దారుణ హత్య
  • ప్రియుడు ఆశు చేతిలో ప్రాణాలు కోల్పోయిన శాలిని
  • అక్కడిక్కడే ప్రియుడ్ని చంపేసిన భర్త ఆకాశ్
  • వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి అసలు కారణం
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. కళ్లెదుటే తన భార్యను ప్రియుడు కత్తితో పొడిచి చంపడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన భర్త అదే కత్తితో అతడిని అంతమొందించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్య ఢిల్లీలోని రామ్ నగర్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆకాశ్ (23) ఇ-రిక్షా నడుపుతూ జీవిస్తున్నాడు. అతడి భార్య శాలిని (22). వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి శాలిని, ఆకాశ్ ఇద్దరూ కుతుబ్ రోడ్డులో ఉన్న శాలిని తల్లిని కలిసేందుకు వెళ్తున్నారు. ఇంతలో, ఆశు అలియాస్ శైలేంద్ర (34) అనే వ్యక్తి అకస్మాత్తుగా వారిని అడ్డగించి, ఆకాశ్ పై కత్తితో దాడికి యత్నించాడు. ఆకాశ్ తప్పించుకోవడంతో, రిక్షాలో కూర్చున్న గర్భిణి అయిన శాలినిపై విచక్షణారహితంగా పలుమార్లు పొడిచాడు.

భార్యను కాపాడే ప్రయత్నంలో ఆకాశ్, ఆశుపై తిరగబడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆకాశ్ కు కూడా కత్తిగాయాలయ్యాయి. అయినప్పటికీ, ఆశుపై పైచేయి సాధించి, అతని చేతిలోని కత్తిని లాక్కుని దాంతోనే అతడిని పొడిచి చంపేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, శాలిని సోదరుడు రోహిత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన శాలిని, ఆకాశ్ లను ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఆశును అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే శాలిని, ఆశు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆకాశ్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

మధ్య ఢిల్లీ డీసీపీ నిధిన్ వన్సాల్ ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం ఆకాశ్, శాలిని మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె స్థానిక నేరచరితుడైన ఆశుతో సంబంధం పెట్టుకుందని తెలిపారు. కొంతకాలం అతనితో సహజీవనం చేసి, ఆ తర్వాత మళ్లీ భర్త ఆకాశ్ దగ్గరికే తిరిగి వచ్చేసిందని చెప్పారు. ఈ పరిణామం ఆశుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. శాలిని కడుపులో పెరుగుతున్న బిడ్డ తన వల్లేనని, ఆకాశ్ తండ్రి కాదని అతను వాదిస్తున్నాడు. అయితే, తన భర్తే బిడ్డకు తండ్రి అని శాలిని స్పష్టం చేయడంతో, కోపం పెంచుకున్న ఆశు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. శాలిని తల్లి షీలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Aashu
Delhi crime
double murder
extra marital affair
crime news
shalini
aakash
ram nagar
kutub road

More Telugu News