Chandrababu Naidu: దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహమ్.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Wishes Happy Diwali to People
  • అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి... సీఎం చంద్రబాబు ఆకాంక్ష
  • రాష్ట్రం ప్రగతి పథంలో ప్రకాశించాలని ఆశాభావం
  • నరకాసుర వధకు ప్రతీకగా పండుగ ప్రాశస్త్యాన్ని గుర్తు చేసిన సీఎం
దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, లోకకంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ సంహరించిన రోజుగా దీపావళికి ఎంతో ప్రాశస్త్యం ఉందని గుర్తుచేశారు. అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే పవిత్రమైన రోజు ఇదని ఆయన అభివర్ణించారు. "దీపం జ్యోతిః పరంబ్రహ్మ... దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే" అంటూ దీపం యొక్క ప్రాముఖ్యతను శ్లోకం ద్వారా ఉదహరించారు.

ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, ప్రగతి పథంలో ప్రకాశించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Deepavali
Diwali
Festival
Hindu Festival
AP CM
Narakasura
Sri Krishna
Satyabhama

More Telugu News