Nitish Kumar Reddy: హిట్ మ్యాన్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న నితీశ్ కుమార్ రెడ్డి... ఫొటోలు ఇవిగో!

Nitish Kumar Reddy Receives ODI Cap From Rohit Sharma
  • ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి
  • టీమిండియా వన్డే జట్టులోకి అడుగుపెట్టిన తెలుగు ఆల్‌రౌండర్
  • నితీశ్‌కు వన్డే క్యాప్ అందించిన సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ
  • టెస్టులు, టీ20ల తర్వాత ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ చోటు
తెలుగు యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు టెస్టులు, టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్ కుమార్ .. ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్ లోనూ జాతీయ జట్టుకు ఎంపికవడం విశేషం. దీంతో అతను మూడు ఫార్మాట్లలోనూ టీమిండియాకు ఆడే సత్తా ఉన్న ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

నేడు పెర్త్ స్టేడియంలో మ్యాచ్ కు ముందు టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ చేతుల మీదుగా నితీశ్ కుమార్ రెడ్డి టీమిండియా వన్డే క్యాప్ అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి కోచ్ గంభీర్, సహచర ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
Nitish Kumar Reddy
India vs Australia
Nitish Kumar Reddy ODI debut
Rohit Sharma
Perth Stadium
Indian Cricket Team
ODI Cricket
Gautam Gambhir
Indian Cricketer

More Telugu News