మళ్లీ ఆగిన మ్యాచ్.. భారత్ స్కోరు 52/4
––
కుదించిన ఓవర్లలో ఇద్దరు బౌలర్లు ఏడేసి ఓవర్లు చొప్పున, మరో ముగ్గురు బౌలర్లు ఆరేసి ఓవర్లు వేసే అవకాశం ఉంది. కాగా, అంతకుముందు లెగ్‌సైడ్ పడిన బంతిని ఎదుర్కోవడంలో విఫలమైన.. శ్రేయస్ 11 పరుగుల వద్ద కీపర్ ఫిలిప్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 45 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ ను కోల్పోయింది. అయ్యర్ స్థానంలో కేఎల్ రాహుల్ క్రీజ్‌లోకి వచ్చాడు. తిరిగి వర్షం పడుతుండడంతో మ్యాచ్ ఆగిపోయింది.