Vladimir Putin: యుద్ధం ఆపేయాలంటే పుతిన్ డిమాండ్ ఇదే..!

Putin demands Donetsk for ending war
  • డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలన్న పుతిన్
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో శాంతి చర్చల్లో వెల్లడి
  • జపొరిజియా, ఖేర్సన్‌ ప్రాంతాలను తిరిగిచ్చేస్తామన్న రష్యా అధ్యక్షుడు
ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేయాలంటే డొనెట్స్క్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వివరించినట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం చేస్తున్న విషయం తెలిసిందే. శాంతి చర్చల్లో భాగంగా ఇరు దేశాధినేతలతో ట్రంప్ పలుమార్లు భేటీ అయ్యారు.

ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ ఇటీవల ఫోన్ చేయగా.. డొనెట్స్క్ తమకు అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేశారని సమాచారం. ఉక్రెయిన్ కు చెందిన జపరోజియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యా బలగాలు ఇప్పటికే ఆక్రమించుకున్నాయి. ఈ భూభాగాలను తిరిగిచ్చేస్తామని పుతిన్ ఆఫర్ చేసినట్లు వైట్ హౌస్ వర్గాలను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనం ప్రచురించింది. అయితే, ఈ కథనంపై ఇంతవరకు అటు క్రెమ్లిన్‌ కానీ ఇటు వైట్‌హౌస్‌ కానీ స్పందించలేదు.
Vladimir Putin
Russia Ukraine war
Donetsk
Donald Trump
Russia
Ukraine
Zaporozhye
Kherson
Peace talks
US relations

More Telugu News