Shubman Gill: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. భారత్‌కు దెబ్బ మీద దెబ్బ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 13 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (8) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఉసూరుమనిపించాడు. 8 బంతులు ఆడిన విరాట్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ శుభమన్ గిల్ కూడా ఔట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. 18 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసిన గిల్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో ఫిలిప్‌కు దొరికిపోయాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిశాయి. భారత్ మూడు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు.