Bandla Ganesh: బండ్ల గణేశ్ ఇంట దీపావళి వేడుకలు.. హాజరైన టాలీవుడ్ హేమాహేమీలు

Bandla Ganesh Celebrates Diwali with Tollywood Stars
  • బండ్ల గణేశ్ ఇంట దీపావళి వేడుకలకు హజరైన చిరంజీవి, వెంకటేశ్, సిద్దు జొన్నలగడ్డ తదితరులు
  • అతిధులను స్వయంగా ఇంట్లోకి ఆహ్వానించిన బండ్ల గణేశ్
  • సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ నివాసంలో ఈసారి కూడా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆయన ఇంట పండుగ సందడి నెలకొంది. బండ్ల గణేష్ ఆహ్వానం మేరకు పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి విచ్చేసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంకటేశ్, యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు హాజరై సందడి చేశారు. అందరూ పండుగ వాతావరణంలో మునిగిపోయి, కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు.

బండ్ల గణేశ్ స్వయంగా అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి, వారితో సరదాగా ముచ్చటించారు. వేడుకల సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 
Bandla Ganesh
Chiranjeevi
Venkatesh
Siddhu Jonnalagadda
Naveen Yerneni
Diwali celebrations
Tollywood events
Telugu cinema
Film producer
Movie celebrities

More Telugu News