Kiran Mazumdar Shaw: బెంగళూరు రోడ్లపై కిరణ్ మజుందార్ షా పోస్టు.. స్పందించిన డీకే శివకుమార్

Kiran Mazumdar Shaw post on Bangalore roads DK Shivakumar responds
  • మజుందార్ షా రహదారులను అభివృద్ధి చేయాలనుకుంటే సహకరిస్తామన్న డీకే
  • ఆమె అడిగితే గుంతలు పూడ్చేందుకు నిధులు కేటాయిస్తామని వ్యాఖ్య
  • బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని వెల్లడి
బెంగళూరు నగర రోడ్లపై ఇటీవల వ్యాఖ్యలు చేసిన బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షాకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కౌంటర్ ఇచ్చారు. మజుందార్ షా రహదారులను అభివృద్ధి చేయాలనుకుంటే తాము సహకరిస్తామని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

ఆమె వచ్చి అడిగితే రహదారుల మీద ఉన్న గుంతలను పూడ్చేందుకు నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు. బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందని వెల్లడించారు.

గత కొంతకాలంగా బెంగళూరు రహదారుల పరిస్థితిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల బయోకాన్ పార్కుకు వచ్చిన ఒక విదేశీ విజిటర్ బెంగళూరు నగరంలోని రోడ్లపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని మజుందార్ షా అన్నారు. ఈ పోస్టు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. బెంగళూరు రోడ్లపై బ్లాక్‌బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యాబాజీ కూడా గతంలో ఒక పోస్టు పెట్టారు. పారిశ్రామికవేత్తల వరుస పోస్టుల నేపథ్యంలో కాంగ్రెస్ నేత స్పందించారు.
Kiran Mazumdar Shaw
DK Shivakumar
Bangalore roads
Karnataka Deputy Chief Minister
Biocon Limited

More Telugu News