Tom Cruise: తొమ్మిది నెలల రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పేసుకున్న టామ్ క్రూజ్, అనా డి అర్మాస్

Tom Cruise Ana de Armas End Nine Month Relationship
  • హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్, నటి అనా డి అర్మాస్ బ్రేకప్
  • వీరి పెళ్లి అంతరిక్షంలో జరగనుందంటూ ఇటీవలే వార్తలు
  • స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్న జంట
హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ (63), అందాల నటి అనా డి అర్మాస్ (37) తమ ప్రేమ బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది. గత 9 నెలలుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఇటీవలే వార్తలు హోరెత్తాయి. వీరి వివాహం ఏకంగా అంతరిక్షంలో అంగరంగ వైభవంగా జరగనుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలు మరువక ముందే, వీరిద్దరూ విడిపోయారంటూ హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టామ్ క్రూజ్, అనా డి అర్మాస్ తమ ప్రేమ ప్రయాణంలో ఎన్నో మధుర క్షణాలను పంచుకున్నారు. అయితే, ఈ బంధాన్ని మరో మెట్టు ఎక్కించే విషయంలో ఇద్దరి మధ్య ఆసక్తి సన్నగిల్లినట్లు సమాచారం. ఈ సంబంధం భవిష్యత్తులో ఎక్కువ కాలం నిలవదని భావించిన ఇద్దరూ, స్నేహపూర్వకంగా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వ్యక్తిగతంగా విడిపోయినప్పటికీ, వృత్తిపరంగా తమ ప్రయాణాన్ని కొనసాగించాలని ఈ జంట నిర్ణయించుకుంది. బ్రేకప్ తర్వాత కూడా రాబోయే సినిమాల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే టామ్ క్రూజ్ తదుపరి చిత్రంలో అనా డి అర్మాస్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు హాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వీరి బ్రేకప్ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
Tom Cruise
Ana de Armas
Tom Cruise Ana de Armas breakup
Hollywood couple
celebrity relationship
dating
Hollywood news
relationship news

More Telugu News