Kiran Abbavaram: 9.6 రేటింగ్ తో 'కె ర్యాంప్' బుకింగ్ లు... దీపావళి విన్నర్ అంటూ కిరణ్ అబ్బవరం హ్యాపీ

Kiran Abbavaram K Ramp bookings with 96 rating Deepavali winner
  • కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా కె ర్యాంప్
  • జైన్స్ నాని దర్శకత్వంలో సినిమా
  • నేడు థియేటర్లలో రిలీజ్ 
  • పాజిటివ్ టాక్ తో ప్రదర్శనలు
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈ దీపావళికి బాక్సాఫీస్ వద్ద అసలైన ఫన్ రాంపేజ్ సృష్టించారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'కె-రాంప్' పండగ కానుకగా విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో దూసుకుపోతోంది. నవ్వులతో నిండిన థియేటర్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండగా, ఈ చిత్రం "యూనానిమస్ దీపావళి విన్నర్" అంటూ చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో 9.6/10 భారీ రేటింగ్ సాధించడం ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారో స్పష్టం చేస్తోందని చిత్ర నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ వెల్లడించింది.

ఈ విజయం పట్ల హీరో కిరణ్ అబ్బవరం తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ విజయం అందించిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. దీపావళి పండగకు కుటుంబమంతా కలిసి థియేటర్‌కు వచ్చి హాయిగా నవ్వుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ సినిమా చేశాం. మేము అనుకున్నది ప్రేక్షకులు నెరవేర్చారు. ప్రతీ ఫ్యామిలీ సినిమాను ఒక ఉత్సవంలా ఎంజాయ్ చేస్తుండటం చూస్తుంటే కడుపు నిండిపోతోంది. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని భావోద్వేగంగా అన్నారు.

సినిమా టాక్‌పై స్పందిస్తూ... "కొందరు ఫస్టాఫ్ బాగుంది, సెకండాఫ్‌ అదిరిపోయిందంటున్నారు... కొందరు ఫస్టాఫ్ పర్లేదు సెకండాఫ్ మోతమోగిపోయిందంటున్నారు... ఫైనల్‌గా థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు పూర్తిస్థాయి వినోదాన్ని ఆస్వాదిస్తున్నారని వస్తున్న స్పందన మాకు కొండంత బలాన్నిచ్చింది. ఇదే మాకు కావాల్సిన అసలైన విజయం. గతంలో నేను నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం చిత్రానికి కూడా ఇదే తరహా టాక్ వచ్చింది" అని కిరణ్ పేర్కొన్నారు.

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ పతాకాలపై రాజేశ్ దండా, శివ బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. నరేశ్, వెన్నెల కిశోర్, కామ్మా జెఠ్మలానీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Kiran Abbavaram
K Ramp
Kiran Abbavaram movie
Deepavali winner
Yukti Thareja
Hasya Movies
Jains Nani
Telugu cinema
Box office collection
Chaitan Bharadwaj music

More Telugu News