BC bandh: పండుగవేళ బంద్ తో ప్రయాణికులకు ఇక్కట్లు.. క్యాబ్ డ్రైవర్ల నిలువుదోపిడి

Telangana Bandh Affects Diwali Travelers
  • దొరికిందే ఛాన్సని దండుకుంటున్న క్యాబ్ లు
  • ఉప్పల్ నుంచి హనుమకొండకు రూ.700 వసూలు
  • డిపోలకే పరిమితమైన బస్సులు.. బస్టాండ్లలో జనం పడిగాపులు
  • పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి తప్పని ఇక్కట్లు
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు రోడ్డెక్కాయి. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాయి. దీంతో ప్రజా రవాణా స్తంభించింది. బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మరికొన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జేబీఎస్, ఎంజీబీఎస్ బస్టాండ్లు బస్సుల్లేక బోసిపోయాయి. ఇప్పుడో, ఇంకాసేపటికో బస్సులు రాకపోతాయా అని ఎదురుచూస్తున్న జనం మాత్రం భారీగా ఉన్నారు. ఉప్పల్ డిపో నుంచి బస్సులు బయటకు రాకపోవడంతో బస్టాండ్ లో క్యాబ్ లు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. బస్సులు నడవకపోవడంతో క్యాబ్ డ్రైవర్లు చార్జీలు అడ్డగోలుగా పెంచేశారు.

సాధారణ రోజుల్లో ఉప్పల్ నుంచి హనుమకొండకు రూ.300 తీసుకునే క్యాబ్ డ్రైవర్లు.. ఇప్పుడు మాత్రం రూ.700 వసూలు చేస్తున్నారు. దీంతో దీపావళి పండుగకు సొంతూరు వెళ్లే ప్రయాణికులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. మరోవైపు, జూబ్లీ బస్ స్టేషన్‌లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం దీపావళి పండుగ నేపథ్యంలో వారాంతపు సెలవులు కూడా కలిసి వచ్చాయని ఊరు వెళ్లేందుకు బస్టాండ్ కు చేరుకున్న జనం బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. బంద్ పై ముందస్తు సమాచారం లేక బస్ స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు, వయోవృద్ధులు, మహిళలతో గంటల తరబడి ఎదురుచూస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు.

BC bandh
Telangana bandh
BC reservations
Telangana news
Diwali travel
Cab drivers
Bus strike
JBS
MGBS
Uppal depot

More Telugu News