ED Raids: హైదరాబాద్‌లోని పలు ఫారెక్స్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

ED Raids Multiple Forex Companies in Hyderabad
  • ఆర్బీఐ లైసెన్స్ లేకుండా సంస్థలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు
  • ప్రిజమ్, గరుడ, విక్టరీ, విమల్‌నాథ్ ఫారెక్స్ సంస్థల్లో సోదాలు
  • పలు సంస్థలు అక్రమంగా డబ్బు మార్పిడి వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడి
హైదరాబాద్ నగరంలోని పలు ఫారెక్స్ సంస్థలపై ఈడీ ఆధికారులు దాడులు నిర్వహించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి లైసెన్స్ లేకుండానే ఈ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయనే ఫిర్యాదుల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. ప్రిజమ్, గరుడ, విక్టరీ, విమల్‌నాథ్ ఫారెక్స్ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.

గతంలో ఆర్బీఐ అధికారులు జరిపిన సోదాల్లో ఈ సంస్థల్లో అవకతవకలు వెలుగుచూడటంతో, ఈడీ కూడా తనిఖీలు చేపట్టింది. ఆర్బీఐ అనుమతులు లేకుండా, బోగస్ పత్రాలతో ఈ సంస్థలు నిర్వహిస్తున్నట్లు సోదాల్లో తేలింది.

కొన్ని ఫారెక్స్ సంస్థలు అక్రమంగా డబ్బు మార్పిడి వ్యాపారం చేస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. పలు సంస్థలు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. ఈ దాడుల్లో నకిలీ పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో పాటు రూ. 11.99 లక్షల నగదు, రూ. 26.77 లక్షల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
ED Raids
Hyderabad
Forex Companies
RBI
Reserve Bank of India
FEMA violations
Money Laundering

More Telugu News