Gopichand Padalkar: అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకండి.. ఇంట్లోనే యోగా చేయండి: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య
- హిందూ యువతులపై కుట్ర జరుగుతోందన్న ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్
- జిమ్‌కు వెళ్లే యువతులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్న ఎమ్మెల్యే
- గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే
హిందూ అమ్మాయిలు జిమ్‌కు వెళ్లకూడదని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీడ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, కళాశాలలకు వెళ్లే హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లవద్దని, ఇంటి వద్దనే యోగా సాధన చేయాలని సూచించారు. హిందూ యువతులపై కుట్ర జరుగుతోందని, ఎవరిని విశ్వసించాలో వారికి తెలియని పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"హిందూ అమ్మాయిలపై ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఎవరైనా బాగా మాట్లాడుతున్నారని లేదా మంచి వ్యక్తి అని మోసపోవద్దు. జిమ్‌లలో శిక్షణ ఇచ్చేవారు ఎవరు అనే విషయాన్ని గమనించాలి. మన ఇంట్లోని యువతులు జిమ్‌కు వెళితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. సరైన గుర్తింపు వివరాలు లేకుండా కళాశాలలను సందర్శించే యువతను అడ్డుకోవాలి" అని గోపీచంద్ పడాల్కర్ పేర్కొన్నారు.
అయితే, గోపీచంద్ పడాల్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సెప్టెంబర్‌లో ఎన్సీపీ-ఎస్పీ నేత జయంత్ పాటిల్, ఆయన తల్లిదండ్రులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యవహారాన్ని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకువెళ్లి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.