Vijay: నటుడు విజయ్ టీవీకే గుర్తింపు పొందిన పార్టీ కాదు: కేంద్ర ఎన్నికల సంఘం

Vijay TVK Not Recognized Party Says Election Commission
  • కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి
  • టీవీకే పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు
  • గుర్తింపు లేనందున హోదా రద్దు అభ్యర్థన నిలబడదని కోర్టుకు తెలిపిన ఈసీ
తమిళ నటుడు విజయ్‌కు చెందిన టీవీకే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు ధర్మాసనానికి నివేదించింది. కరూర్‌లో విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపును రద్దు చేయడంతో పాటు రాజకీయ పార్టీల ప్రచార సభల్లో మహిళలు, చిన్నారులు పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

వీటిని సీజే జస్టిస్ ఎంఎం శ్రీవాస్తవ, జస్టిస్ జీ అరుల్ మరుగణ్‌ల ధర్మాసనం విచారించింది. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాల్ కోర్టులో వాదనలు వినిపించారు. టీవీకే పార్టీకి గుర్తింపు లేనందున ఆ పార్టీకి ఆ హోదా రద్దు చేయాలనే అభ్యర్థన నిలబడదని కోర్టుకు తెలిపారు.

మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు మినహా ఈ కేసుల విచారణకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేందుకు వీలుగా వాటన్నింటినీ హైకోర్టు పాలనా వ్యవహారాల విభాగం ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
Vijay
Tamil Nadu
TVK party
Central Election Commission
Madras High Court
Karur stampede

More Telugu News