Anirudh Reddy: మరో రెండుసార్లు గెలిపిస్తే నేనూ ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతా: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Anirudh Reddy I will become CM if you elect me twice
  • జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
  • మంత్రుల జిల్లాలు, నియోజకవర్గాలకే నిధులు వెళుతున్నాయన్న అనిరుధ్ రెడ్డి
  • ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే మంత్రులం, ముఖ్యమంత్రులం అవుతామని వ్యాఖ్య
మరో రెండు పర్యాయాలు తనను శాసనసభ్యునిగా గెలిపిస్తే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అవుతానని కాంగ్రెస్ నాయకుడు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలకు, నియోజకవర్గాలకే నిధులు తరలివెళుతున్నాయని ఆయన ఆరోపించారు. తమను శాసనసభ్యులుగా గెలిపిస్తేనే కదా తాము కూడా మంత్రులు, ముఖ్యమంత్రులం అయ్యేది అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల మాజీ శాసనసభ్యుడు ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కూడా ఆయన పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి ద్రోహం చేసి సొమ్ము చేసుకున్న వారికి తిరిగి పార్టీలో ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేశారు. హత్యలు చేసేవారికి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండబోదని ఆయన అన్నారు. సొంత సోదరుడినే చంపిన వారు రాజకీయాల కోసం తనను కూడా చంపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జెడ్ కేటగీరి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Anirudh Reddy
Jadcherla
Congress MLA
Telangana politics
Errra Shekhar
Telangana Congress

More Telugu News