Gold Rate: బంగారం ప్రియులకు షాక్... ఈరోజు కూడా భారీగా పెరిగిన ధర

Gold Rate Today Big Shock Gold Rates Increased Heavily Today
  • ధన త్రయోదశికి ముందు భారీగా పెరిగిన పసిడి ధరలు
  • ఒక్కరోజే తులంపై రూ.3000 పైగా పెరుగుదల
  • 24 క్యారెట్ల ధర రూ.1,32,770 వద్ద స్థిరీకరణ
పండుగ సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా ధన త్రయోదశి సమీపిస్తున్న వేళ పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. శుక్రవారం ఒక్కరోజే తులం బంగారంపై రూ.3000 పైగా పెరిగి వినియోగదారులను ఆందోళనకు గురిచేసింది. అయితే, వెండి ధర తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం.

శుక్రవారం ఉదయం నాటికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. నిన్నటితో పోలిస్తే 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.3,050 పెరిగి రూ.1,21,700కు చేరుకుంది. అదేవిధంగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తులంపై రూ.3,330 పెరిగి రూ.1,32,770 వద్ద స్థిరపడింది.

మరోవైపు బంగారం ధరలకు భిన్నంగా వెండి ధర దిగివచ్చింది. కిలో వెండిపై రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.2,03,000గా ఉంది. బంగారం ధరలు పరుగులు పెడుతున్న తరుణంలో వెండి ధర తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 
Gold Rate
Gold price hike
Dhanteras
Hyderabad gold rate
Vijayawada gold rate
Telugu states gold price
Silver rate
Commodity market
Gold investment
22 Carat gold

More Telugu News