Siddu Jonnalagadda: ఫేవరెట్ హీరో వివాదం... ట్రోలింగ్ కు గురైన సిద్ధు జొన్నలగడ్డ

Siddu Jonnalagadda Trolled Over Favorite Hero Controversy
  • అభిమానులతో ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించిన హీరో సిద్దు
  • అభిమాన నటుడు రణ్‌బీర్ కపూర్‌గా పేర్కొన్న సిద్దూ
  • బాలీవుడ్ హీరోను ఫేవరైట్ హీరోగా పేర్కొనడంపై నెటిజన్ల విమర్శలు
ఫేవరెట్ హీరో వివాదం కారణంగా హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ మరోసారి అభిమానులను అలరించేందుకు వస్తున్నారు.

సిద్ధూ హీరోగా వస్తోన్న రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ మూవీ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో ఒక్క రోజు ముందు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆస్క్ సిద్దు పేరుతో చిట్ చాట్ నిర్వహించారు.

అయితే, ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సిద్దు చెప్పిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సిద్దును “మీ ఫేవరెట్ హీరో ఎవరు?” అని అడగగా, “రణ్‌బీర్ కపూర్” అని ఆయన సమాధానం ఇవ్వడం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారి తీసింది.

తెలుగులో అనేక మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ బాలీవుడ్ హీరోని అభిమాన నటుడుగా పేర్కొనడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ హీరోలే సిద్దును సపోర్ట్ చేస్తుంటే, బాలీవుడ్ హీరోను మెచ్చుకోవడమేంటి అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇక మరోవైపు, కొంత మంది అభిమానులు మాత్రం సిద్దు అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుస ఫ్లాపులతో నిరాశ చెందిన సిద్దు.. ఈసారి ‘తెలుసు కదా’ మూవీతో హిట్ సాధించాలని ప్రయత్నిస్తున్నారు.

తెలుసు కదా మూవీలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతిప్రసాద్ నిర్మించారు. 
Siddu Jonnalagadda
Tillu Square
Telusukada Movie
Ranbir Kapoor
Telugu cinema
Tollywood
Raashi Khanna
Srinidhi Shetty
Neeraja Kona
Movie promotions

More Telugu News