Narendra Modi: ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ స్పందన

Narendra Modi says AP tour was satisfactory
  • ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రధాని మోదీ హర్షం
  • పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడి
  • ఏపీ స్వాభిమాన సంస్కృతికి నిలయమంటూ ప్రశంస
  • శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడం అదృష్టమన్న ప్రధాని
  • కర్నూలు జీఎస్టీ బచత్ సభలో పాల్గొన్న మోదీ, చంద్రబాబు, పవన్
  • సోషల్ మీడియా 'ఎక్స్‌' వేదికగా తన పర్యటన వివరాల వెల్లడి
తన ఆంధ్రప్రదేశ్ పర్యటన ఎంతో సంతృప్తికరంగా, ఆనందంగా ముగిసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏపీ అనేది స్వాభిమాన సంస్కృతికి, విజ్ఞానం, ఆవిష్కరణలకు కేంద్రబిందువని ఆయన కొనియాడారు. రాష్ట్ర పర్యటన ముగిసిన అనంతరం, తన అనుభవాలను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' లో పంచుకున్నారు. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వేగాన్ని, సామర్థ్యాన్ని నేడు ప్రపంచం గమనిస్తోందని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పరిశ్రమలను మరింత బలోపేతం చేయడంతో పాటు, పౌరుల సాధికారతకు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని మోదీ అన్నారు. తన పర్యటనలో భాగంగా శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గురువారం కర్నూలు శివారులోని నన్నూరులో నిర్వహించిన 'జీఎస్టీ బచత్ సభ'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Narendra Modi
Andhra Pradesh
AP Tour
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Srisailam
Mallikarjuna Swamy
GST Bachat Sabha
Kurnool

More Telugu News