Sumeet Sabharwal: ఎయిరిండియా విమాన ప్రమాదం ఘటన.. సుప్రీంకోర్టులో పైలట్ తండ్రి పిటిషన్
- ప్రాథమిక దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్ ఆరోపణ
- దర్యాప్తు బృందం ప్రధానంగా పైలట్ల పైనే దృష్టి సారించిందని పిటిషన్
- ప్రధాన పైలట్ సుమీత్ సభర్వాల్ కెరీర్‌లో ఒక్క మచ్చ కూడా లేదని వెల్లడి
ఈ ఏడాది జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్పరాజ్ సభర్వాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత పైలట్ల సమాఖ్య కూడా ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో న్యాయస్థానం పర్యవేక్షణ కోరుతూ వారు పిటిషన్ దాఖలు చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి కుప్పకూలడంతో 260 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో ప్రధాన పైలట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్ కూడా మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్లు ఆరోపించారు. దర్యాప్తు బృందం ప్రధానంగా పైలట్ల పైనే దృష్టి సారించిందని అన్నారు. ఈ విషాదానికి దారితీసిన సాంకేతిక, విధానపరమైన అంశాలను పరిశీలించడంలో విఫలమైందని అన్నారు.
దర్యాప్తు సంస్థ నివేదికలోని ఎంపిక చేసిన భాగాలను బహిర్గతం చేయడం ద్వారా వాస్తవాలను తప్పుదోవ పట్టించడం, పైలట్లను లక్ష్యంగా చేసుకోవడం వంటివి అసలైన కారణాన్ని గుర్తించడాన్ని కఠినతరం చేస్తాయని పేర్కొంది. ఈ దర్యాప్తు బృందంలో డీజీసీఏ, విమానయాన అధికారులే ఉన్నారని పేర్కొన్నారు. ఏ వ్యక్తి కూడా తన సొంత కేసులో న్యాయమూర్తిగా ఉండకూడదనే సహజ న్యాయసూత్రాన్ని ఇది ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు.
ప్రధాన పైలట్ సుమీత్ సభర్వాల్‌కు దశాబ్దాల అనుభవం ఉందని, ముప్పై ఏళ్ల కెరీర్‌లో ఒక్క మచ్చ కూడా లేదని కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీతో న్యాయ పర్యవేక్షణలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.