Alexander Novak: రష్యా చమురుకు చైనా కరెన్సీలో భారత్ చెల్లింపులు: రష్యా ఉప ప్రధాని

Alexander Novak India pays for some Russian oil in Chinese Yuan
  • అది స్వల్పమేనని అలెగ్జాండర్ నోవాక్ వెల్లడి
  • చాలా లావాదేవీలు రూబుల్‌లో జరుగుతున్నాయన్న అలెగ్జాండర్
  • భారత్ చమురు కొనుగోలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన అలెగ్జాండర్
రష్యా చమురుకు సంబంధించిన కొన్ని చెల్లింపులను భారత్ చైనా కరెన్సీ యువాన్‌లో జరిపిందని రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ పేర్కొన్నారు. అయితే, అధిక లావాదేవీలు రూబుల్స్‌లోనే జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. యువాన్‌ రూపంలో చెల్లించిన మొత్తం స్వల్పమని ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

భారతదేశం తమ దేశం నుంచి చమురు కొనుగోలును కొనసాగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, భారత్‌పై తమకు నమ్మకం ఉందని, రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగుతుందని అలెగ్జాండర్ అన్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ రెండవ అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌పై రష్యా చర్యలు ప్రారంభించిన తర్వాతే ఈ చమురు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. దీని కారణంగా రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అప్పటి నుంచి వ్యాపార లావాదేవీల కోసం ప్రత్యామ్నాయ కరెన్సీలైన యువాన్, యూఏఈ దిర్హామ్ వినియోగం పెరిగింది. సెప్టెంబర్ నెలలో రష్యా నుంచి చమురు కోసం భారత్ 2.5 బిలియన్ యూరోలు వెచ్చించింది. ఇది అంతకు ముందు నెలతో పోలిస్తే 14 శాతం తక్కువ.
Alexander Novak
Russia oil
India
China currency
Yuan
Rupee
oil imports
Russia India trade

More Telugu News