Madhu Bangarappa: పదో తరగతి పాస్ మార్కులు తగ్గించిన కర్ణాటక ప్రభుత్వం
- 35 మార్కులు కాదు.. 33 మార్కులు వస్తే పాస్
- విద్యార్థులు చదువుకు దూరం కావొద్దనే నిర్ణయం
- కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప వెల్లడి
పదో తరగతి విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పబ్లిక్ పరీక్షలో పాస్ మార్కులు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతీ సబ్జెక్ట్ లో 33 మార్కులు తెచ్చుకుంటే పాస్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటీ అరా మార్కులతో పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, దీనిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక మంత్రి మధు బంగారప్ప పేర్కొన్నారు.
కిందటేడాది వరకు పదో తరగతిలో పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 35 శాతం మార్కులు తెచ్చుకోవాల్సిందే. ఒకటీ అరా మార్కులతో ఫెయిలైన విద్యార్థి తిరిగి సప్లిమెంటరీ పరీక్షల కోసం వేచి ఉండాలి. ఈ గ్యాప్ లో విద్యార్థులను వారి తల్లిదండ్రులు పనికి పంపించడం, ఆడపిల్లలైతే పెళ్లి చేసి పంపించడం చేస్తున్నారని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బంగారప్ప చెప్పారు. ఆ తర్వాత పిల్లలు చదువుకు శాశ్వతంగా దూరమవుతున్నారని తెలిపారు. దీనిని తప్పించేందుకు పాస్ మార్కులను 33 కు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచే ఈ రూల్ ను అమలు చేస్తామని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుందని మంత్రి తెలిపారు.
తాజా రూల్ ప్రకారం..
ఈ విద్యా సంవత్సరం నుంచి ఎస్ఎస్ఎల్‌సీలో 33 శాతం మార్కులు పొందితే ఆ విద్యార్థులు పాస్ అయినట్లే.. ఎస్ఎస్ఎల్‌సీలో మొత్తం మార్కులు 625 కాగా దీనిలో 33 శాతం అనగా 206 మార్కులు వస్తే ఆ విద్యార్థులు ఉత్తీర్ణులవుతారని మంత్రి బంగారప్ప వివరించారు.