పాక్ నుంచి ట్రంప్ కుమారుడికి డబ్బు ముడుతోంది.. అమెరికా మాజీ రాయబారి
- ఆ డబ్బు కోసమే భారత్ తో అమెరికా బంధాన్ని తెంచేస్తున్నాడని ఆరోపణ
- 40 ఏళ్ల దౌత్య సంబంధాలను వదులుకున్నాడని ఫైర్
- చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి భారత్
చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు అత్యంత కీలకమైన, నమ్మకమైన భాగస్వామి భారతదేశమేనని ఇమాన్యుయేల్ చెప్పారు. ఆ విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు ట్రంప్ అహం చూపిస్తున్నారు. భారత్ పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది తానేనని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చడమూ ఓ కారణమేనని చెప్పారు. కాగా, రహమ్ ఇమాన్యుయేల్ గతంలో జపాన్ కు అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమెరికా, భారత్ సంబంధాలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.